కే వీ మధు మూర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;కే వీ మధు మూర్తి

ఈ కథ ఆసక్తికరంగానూ, ఆలోచన రేకెత్తించేట్లుగానూ ఉంది. ఇటువంటి కథను అందించిన పూర్ణిమ గారికి నెనర్లు. డాక్టరు చీటీపై మ్యారేజీ అని రాయడాన్ని దొర్సామి నాయుడు గారు చెప్పినట్లు “మెటఫోరికల్” గా తీసుకోవాలి. రచయిత్రి ఉపయోగించిన కొన్ని పదాలపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. భాష, కళలు దేశాకాలాలను బట్టి మారుతూ వుంటాయి. ఒకప్పటి దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాలు, పెద్దన మనుచరిత్ర వంటి ప్రబంధాలలోని శృంగార వర్ణనలు పస్తుతం అసభ్యకరంగా అనిపించ వచ్చు. మనం అభ్యంతరకరం అనుకుంటున్న పదాలను (fu*k లాంటివి) ఇప్పటి పిల్లలు ఫ్రీగా ఇంటిలోనే వాడేస్తున్నారు. మనం వద్దని చెబితే మనల్ని ఏ రాతియుగం నుంచి వచ్చారు అన్నట్లు చూస్తున్నారు. అన్నీ టీవీ చానెళ్లలోనూ ఇటువంటి భాషే. ముఖ్యమైన వ్యక్తుల సంభాషణల్లోనూ, ప్రసంగాలలోకూడా. ఆంగ్లేయ నవలలలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. కాబట్టి తెలుగు కథలలో ఈ కాలాని తగినట్టుగా ఇటువంటి పదాల వాడకం పెరుగుతోంది. కథలో కథానాయిక యొక్క అస్తిత్వపు బెంగను (existential angst) ఆసక్తికరంగా చూపించారు. ఆమెకు పెళ్లి ఒక సమస్య. యువతకు ప్రస్తుత యాంత్రిక యుగంలో, ప్రాధమిక అవసరాలు, అవసరమైన కోరికలు తీర్చుకున్న తరువాత జీవితానికి అర్థం ఏమిటో తెలియడం లేదు. రాబోవు కాలంలో కృత్రిమ మేధ అభివృద్ధి ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తుందేమో.


16 April 2024 8:18 PM